Top News

Family Certificate Issue | ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ఎప్పుడు?

 


ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ఎప్పుడు? 

దరఖాస్తు చేసుకున్నా, జారీ చేయడం లేదు

వెంటనే జారీ చేయాలని బీఆరెస్ నేత అక్బర్ డిమాండ్ 

బాన్సువాడ :తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీకి అనుమతి ఇచ్చినప్పటికీ కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా బాన్సువాడలో రెవిన్యూ అధికారులు వాటిని జారీ చేయడం లేదని మాజీ వార్డు మెంబర్, బీఆరెస్ నేత షేక్ అక్బర్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో అనేక మంది ప్రజలు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదని తెలిపారు. 

హైదరాబాద్ లోని సైదాబాద్ మండలంలో 30-07-2026 తేదీన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయిన ఉదాహరణను ఆయన చూపించారు. రాష్ట్రంలో ఒకచోట జారీ చేస్తూ, మరోచోట జారీ చేయకపోవడం అధికారుల వివక్షకు నిదర్శనమని అన్నారు.

ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాలకు, విద్య, ఉద్యోగ అవసరాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 

 ప్రభుత్వం వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లాలోని బాన్సవాడతో పాటు అన్ని మండలాల్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీని తక్షణమే ప్రారంభించాలని షేక్ అక్బర్  డిమాండ్ చేశారు. బాన్సువాడ ఆర్డీఓ వెంటనే స్పందించాలని కోరారు 

హైదరాబాద్ లో జులై 30న జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికెట్ 




Post a Comment

أحدث أقدم