Top News

CPI Protest | బాన్సువాడలో సీపీఐ పాదయాత్ర

బాన్సువాడలో సీపీఐ పాదయాత్ర

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన

బాన్సువాడ, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం బాన్సువాడ పట్టణంలో పాదయాత్ర జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగిన ఈ ర్యాలీలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిత్యావసర ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాదయాత్ర అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు దుబ్బాస్ రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم