కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత
9 కిలోల గంజాయితో యువకుడు అరెస్ట్ - ఎక్సైజ్, రైల్వే పోలీసుల సంయుక్త ఆపరేషన్
కామారెడ్డి : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 కిలోల గంజాయి పట్టుబడింది.
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, రైల్వే టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్ (Train No.20811) లోని జనరల్ బోగీలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 5 ప్యాకెట్లలో 9 కిలోల ఎండు గంజాయి లభించింది.
నిందితుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్ పటేల్ (20), తండ్రి లాల్జీ పటేల్‌గా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు DPEO తెలిపారు.
ఈ దాడులలో కామారెడ్డి ఎక్సైజ్ CI సహదేవ్ కృష్ణ, SI భిక్షమ్, రైల్వే టాస్క్ ఫోర్స్ SI వెంకటేష్ బాబు, RPF ASI రవీంద్రబాబు, SI శ్రీనివాస్ రావు, ట్రైన్ ఎస్కార్ట్ సిబ్బంది మధు, అనిల్, రచన మరియు సిబ్బంది HC ఫరీద్, బయ్యన్న, బాలసాహెబ్, కానిస్టేబుల్ పవన్, బాబు, రాజు, చంద్రశేఖర్, దివేష్, మీనాక్షి, నివాని, రమ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق