Top News

Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జాతీయ జెండా ఆవిష్కరణ

జాతీయ ఐక్యత, సమైక్యతకు ప్రతీక : ఎమ్మెల్యే కేవీఆర్ 

కామారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి MLA క్యాంపు కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరించుకుంటూ వారి త్యాగాలతో సాధించిన స్వాతంత్య్రాన్ని నేటి తరానికి గుర్తు చేసేందుకే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై రెపరెపలాడే జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర సమరయోధుల స్మరణే ఈ కార్యక్రమ లక్ష్యమని, జాతీయ ఐక్యత, సమైక్యతను పెంపొందించడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సూచించారు. వీడియోలు 👇👇👇



కౌన్సిలర్ కు పరామర్శ 


కామారెడ్డి పట్టణం 16 వ వార్డు కౌన్సిలర్ యాడారం ప్రియాంక సంతోష్ వాళ్ళ నాన్న ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి పరామర్శించి మనోధైర్యంగా ఉండాలని సూచించారు.

Post a Comment

أحدث أقدم