Top News

Hospital Inspection | పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆకస్మిక తనిఖీ

పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆకస్మిక తనిఖీ 

రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచన 

జుక్కల్:  జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు  శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.

ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, శుభ్రత, సిబ్బంది హాజరు, పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులు, వారి వెంట వచ్చిన బంధువులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అధికారులకు సూచనలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది, అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేయాలని కోరారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు తెలిపారు.ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم