నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా సాగాలి : షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వారు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో అండగా నిలవడమే నిజమైన మానవత్వమన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని, తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గంగా జమునా తహజీబ్ సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, కులం, మతం, భాష, ప్రాంతం తేడా లేకుండా అందరినీ సమానంగా గౌరవించడమే తమ విధానమని అన్నారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా జీవించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాదిగా ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, జావీద్ అక్రమ్, ఖుద్దూస్, హరూన్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందాన్, అన్వార్, మహమ్మద్ అహ్మద్, కో-ఆప్షన్ మెంబర్ మహేందర్ సింగ్, ఆసిఫ్, వహీద్, మీలాద్ కమిటీ అధ్యక్షులు షోయబ్ రజా, మహమ్మద్ అబు రజా, రషీద్ రాజా, ముజాహిద్ ఖాన్, పాప ఖాన్, జావీద్ ఖాన్, ఖయ్యూమ్, షబ్బీర్ రజాక్, జఫర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొయిన్, సమీ, రియాజుద్దీన్, సఫ్దర్, అఫ్రోజ్ ఖాన్, సాదిక్, సోహైల్, షేక్ మహబూబ్, పర్వేజ్, ఈసా, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









إرسال تعليق