మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన మాల సంఘం ప్రతినిధులు
రోస్టర్ పాయింట్ మార్పు, రిజర్వేషన్ పెంపుపై వినతి
రోస్టర్ పాయింట్ 22 వల్ల అన్యాయం: అయ్యాల సంతోష్
హైదరాబాద్: ఈరోజు ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, పారిశ్రామిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాల సంఘం ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రోస్టర్ పాయింట్ 22 వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రోస్టర్ పాయింట్‌ను 15కు మార్చాలని, మాలలకు కేటాయించిన 8 శాతం రిజర్వేషన్‌ను పెంచాలని వినతిపత్రంలో కోరారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేబినెట్‌లో చర్చించి మాలలకు న్యాయం జరిగే విధంగా చూడాలని మంత్రిని కోరారు.
రోస్టర్ పాయింట్‌లో మార్పు రాకపోతే భవిష్యత్‌లో మాలలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అయ్యాల సంతోష్ వివరించారు. కావున రోస్టర్ పాయింట్ మార్పునకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి
మాల సంఘం వినతిని సావధానంగా విన్న మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు మధు, నరేష్, నిరూప్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق