తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న మృతితో కంటతడి పెట్టిన పోచారం
తగిలేపల్లిలో భావోద్వేగ వాతావరణం.. వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం : ఎమ్మెల్యే
కుటుంబాన్ని పరామర్శించి భరోసా.. అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
బాన్సువాడ: వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్వర్లు (వెంకన్న) హత్య ఘటన బాన్సువాడ నియోజకవర్గంలో విషాదాన్ని నింపింది.
ఆయన మృతదేహాన్ని చూసి, అనుబంధాన్ని గుర్తు చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తగిలేపల్లిలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
వెంకన్న స్వగ్రామమైన తగిలేపల్లికి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకన్నతో తనకున్న దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఆయన వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.




إرسال تعليق