బాన్సువాడలో 21న ప్రైవేట్ పాఠశాలల బంద్
ప్రధానోపాధ్యాయురాలి హత్యను ఖండిస్తూ సంఘీభావం
బాన్సువాడ, ఆగస్టు 20: నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనను ఖండిస్తూ బాన్సువాడలోని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం బంద్ చేయనున్నాయి. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం TRSMA ఇచ్చిన పిలుపు మేరకు బాన్సువాడ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. బాన్సువాడ పట్టణం మరియు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు రేపు సెలవు ప్రకటించాయి.
ఈ సందర్భంగా బాన్సువాడ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మాట్లాడుతూ ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ వృత్తికి గౌరవం, న్యాయం జరగాలని కోరింది.
నిరసన కార్యక్రమంలో బాన్సువాడ పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సంఘీభావంగా పాల్గొనాలని సంఘం పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులపై దాడులు ఆగాలంటే కఠిన చట్టాలు రావాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

إرسال تعليق