జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరం
శుక్రవారం కామారెడ్డిలో యశోదా ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్
TUWJ నేతల పిలుపు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 20: జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ IJU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజనీకాంత్, రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, సుధాకర్ గౌడ్ తెలిపారు.
సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్స్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కామారెడ్డిలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాలలో ఈ శిబిరం జరుగుతుంది. కళాశాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఉంది.
కార్డియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బీపీ, షుగర్ GRBS, బరువు, ఆక్సిజన్ స్థాయి SpO2, పల్స్ రేట్ పరీక్షలతో పాటు ఈసీజీ, ఎముకల సాంద్రత BMD పరీక్షలను కూడా డాక్టర్ సూచన మేరకు ఉచితంగా చేస్తారు.
యశోదా హాస్పిటల్స్ సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ సర్జన్ డా. లక్ష్మణ శాస్త్రి G ఈ శిబిరంలో పాల్గొని జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తారు.
జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని TUWJ నేతలు కోరారు. మరిన్ని వివరాలకు 9494053917, 9063473167 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

إرسال تعليق