Top News

Rajiv Gandhi Jayanti | ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  

జాతీయ సద్భావనా దినోత్సవం సందర్భంగా నివాళులు  

దేశ ఐటీ విప్లవానికి ఆద్యుడని  కొనియాడిన కాంగ్రెస్ నేతలు 

బాన్సువాడ, ఆగస్టు 20: మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ  రాజీవ్ గాంధీ జయంతి, జాతీయ సద్భావనా దినోత్సవం సందర్భంగా గురువారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అతి పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ పరిశ్రమకు ఆద్యుడని అన్నారు. యువతను దేశ భవిష్యత్తుగా భావించి సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అమలు చేసిన ఎన్నో సంస్కరణల ఫలితంగానే నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కో ఆప్షన్ అలీ బిన్ అబ్దుల్లా,  సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ ఏజాజ్, మాజీ ఏఎంసీ నార్ల రవీందర్, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మాసని రవీందర్ రెడ్డి, అజిం, షాదీ ఖానా చైర్మన్ వాహబ్,  బాబా, దాసరి శ్రీను, మట్ట సాయిలు, కౌన్సిలర్లు ఖాలేక్, హకీం, నంద కిషోర్, కటిక రమేష్, ముజ్జు, గౌస్, యూత్అ ధ్యక్షులు మన్సూర్, రఫీ, ఇలియాస్, అలీ, సాదక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







Post a Comment

أحدث أقدم