Top News

Shab E Taskiya | బాన్సువాడలో షబ్-ఎ-తజ్కియా కార్యక్రమం ప్రారంభం

బాన్సువాడలో షబ్-ఎ-తజ్కియా కార్యక్రమం ప్రారంభం

మదీనా మసీదులో ఏక్ రాత్ ఎతెకాఫ్ నియత్ తో షబ్-ఎ-తజ్కియా ఇస్లాహి, రూహాని మజ్లిస్ 

బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీ మదీనా మసీదులో ఏక్ రాత్ ఎతెకాఫ్ నియత్ తో షబ్-ఎ-తజ్కియా ఇస్లాహి, రూహాని మజ్లిస్ కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజ్రత్ మౌలానా ఇస్మాయిల్ లాల్ సాహెబ్ నౌసారి (గుజరాత్), ఖలీఫా హజ్రత్ మౌలానా సలాహుద్దీన్ సైఫీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మౌలానా ఇస్మాయిల్ లాల్ మాట్లాడుతూ.. సీరత్-ఉన్-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి వివరిస్తూ, ప్రవక్త మహమ్మద్ (స) జీవిత చరిత్రను ప్రతి ముస్లిం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మృత హృదయాలలో ఈమాన్ ను సజీవంగా నిలపడానికి, గఫ్లత్ నుండి బయటపడటానికి ఇలాంటి రూహాని మజ్లిస్ లు ఎంతో అవసరమని అన్నారు.

ఈ రాత్రి అల్లాహ్ తో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, దిల్ ను శుద్ధి చేసుకోవడానికి, గునాహుల నుండి తౌబా చేసుకోవడానికి ఉత్తమమైన అవకాశమని తెలిపారు.

కార్యక్రమం మగ్రిబ్ నమాజ్ తర్వాత దురూద్ షరీఫ్ మజ్లిస్ తో ప్రారంభమై, ఇషా నమాజ్ వరకు ప్రత్యేక ప్రసంగం, తహజ్జుద్, జిక్ర్, తిలావత్, ఫజర్ తర్వాత ఇస్లాహి బయాన్, చివరగా ఇఫ్తితామి దువాతో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం సూరహ్ యాసీన్ తిలావత్ కూడా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణంతో పాటు మదీనా కాలనీకి చెందిన పెద్దలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


بانسوڑہ میں شبِ تزکیہ کا روحانی و اصلاحی اجتماع شروع

بانسوڑہ، 27 اگست: بانسوڑہ شہر کے مدینہ کالونی کی مدینہ مسجد میں ایک رات اعتکاف کی نیت سے شبِ تزکیہ اصلاحی و روحانی مجلس کا آغاز جمعرات کی رات شاندار طریقے سے ہوا۔

اس بابرکت مجلس کے مہمانِ خصوصی حضرت مولانا اسماعیل لال صاحب نوساری (گجرات) خلیفہ حضرت مولانا صلاح الدین سیفی صاحب تشریف لائے۔

اس موقع پر حضرت مولانا اسماعیل لال صاحب نے سیرت النبی ﷺ کے موضوع پر بیان فرماتے ہوئے کہا کہ ہر مسلمان کو حضور اکرم ﷺ کی زندگی کو اپنے لیے نمونہ بنانا چاہیے۔ انہوں نے فرمایا کہ مردہ دلوں میں ایمان کی حرارت پیدا کرنے اور غفلت کی بیماری سے نجات کے لیے ایسی روحانی مجالس بہت ضروری ہیں۔

انہوں نے فرمایا کہ یہ رات اپنے رب سے تعلق مضبوط کرنے، دل کی اصلاح، گناہوں سے توبہ اور ایمان کی تازگی و روحانی سکون حاصل کرنے کا بہترین موقع ہے۔

مجلس کی ترتیب: نمازِ مغرب کے بعد درود شریف کی مجلس، نمازِ عشاء کے فوراً بعد حضرت کا خصوصی خطاب، بیان کے بعد طعام کا انتظام، تہجد کے وقت نماز، تہجد و دعا، اذان اور نماز کے درمیانی وقت میں سورہ یسین کی تلاوت، نمازِ فجر کے بعد خصوصی اصلاحی بیان اور آخر میں اختامی دعا پر یہ مجلس اختتام پذیر ہوگی۔

اس موقع پر مدینہ کالونی کے بزرگ، نوجوان اور بچے بڑی تعداد میں شریک ہوئے۔

Post a Comment

أحدث أقدم