Top News

Officials Action | చిన్నారి మృతితో కదిలిన యంత్రాంగం - రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు షురూ

 

చిన్నారి మృతితో కదిలిన యంత్రాంగం - రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు షురూ

ప్రమాదాలకు కారణమవుతున్న నిర్మాణాలపై ఆర్డీవో, మున్సిపల్, పోలీస్ శాఖల ఉమ్మడి తనిఖీ

బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి చెందిన ఘటన యావత్ పట్టణాన్ని కలచివేసింది. ఈ విషాద ఘటనతో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది.

ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే  ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, పట్టణ సీఐ తుల శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

తనిఖీలో వెల్లడైన అంశాలు (Exclusive):

అధికారుల పరిశీలనలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. చౌరస్తా మలుపులో రోడ్డుకు ఆనుకుని ఉన్న అక్రమ షెడ్లు, తోపుడు బండ్లు, ఫ్లెక్సీ బోర్డుల కారణంగా వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని గుర్తించారు. ముఖ్యంగా స్కూల్ సమయంలో విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో దృష్టికి ఆటంకం ఏర్పడుతోందని తేలింది.video 👇


వెంటనే చర్యలు:

ప్రమాదానికి కారణమవుతున్న రోడ్డు పక్కన అక్రమ నిర్మాణాలను గుర్తించి జేసీబీలతో తొలగింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన రహదారి భద్రతా చర్యలు చేపడతామని ఆర్డీవో రవీందర్ రెడ్డి తెలిపారు.

అయితే ప్రమాదం జరిగిన తర్వాతే స్పందించడం కాదు, ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




Post a Comment

أحدث أقدم