Top News

Shabbir Ali | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

 


రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

మాచారెడ్డి PACS చైర్మన్ గా నౌసిలాల్ నాయక్, అంతంపల్లి PACS చైర్మన్ గా సుధాకర్ రెడ్డి ప్రమాణం

అర్హులైన పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో బుధవారం మూడు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మాచారెడ్డి PACS, అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాలు, అలాగే బాలాజీ ఫంక్షన్ హాల్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాచారెడ్డి PACS చైర్మన్ గా నౌసిలాల్ నాయక్, అంతంపల్లి PACS చైర్మన్ గా చిట్టెడి సుధాకర్ రెడ్డి తమ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. PACS లు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధి కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గత 15 ఏళ్లుగా కొత్త కార్డులు లేక అర్హులైన పేదలు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత కల్పిస్తున్నామని, దీనితో అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, నాయకులు సురేష్ నర్సింగరావు, కమలాకర్ రెడ్డి, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.











Post a Comment

أحدث أقدم