Top News

SP | ఎస్పీని కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

కామారెడ్డి, ఆగస్టు 24: కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నూతన అధ్యక్షుడు కె. రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు బి. సంతోష్ కుమార్, పి.ఎన్. సాయి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి తులా శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె. మధుకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, కోశాధికారి ఎస్. సాయిలు తదితర కార్యవర్గ సభ్యులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ అధికారుల సంక్షేమం, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలని, శాఖలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Post a Comment

أحدث أقدم