బాన్సువాడలో సబ్ రిజిస్ట్రార్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
బాన్సువాడ : బాన్సువాడ మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ (SRO) భవన నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని అధికారులు శుక్రవారం పరిశీలించారు. పట్టణ శివారులో ఉన్న బోర్లం రోడ్డు కల్కి చెరువు పక్కన ఈ స్థలాన్ని పరిశీలించారు.
అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (జిల్లా సమగ్ర అభివృద్ధి సంస్థ), ఆర్డీవో రవీందర్ రెడ్డి సంయుక్తంగా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. స్థలం అనుకూలత, విస్తీర్ణం, రోడ్డు కనెక్టివిటీ తదితర అంశాలను పరిశీలించారు.
త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.

إرسال تعليق