Top News

Theft Case | దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసు ఛేదన

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసు ఛేదన  

వారం రోజుల్లోనే నిందితుడి అరెస్ట్ – 16 తులాల బంగారు ఆభరణాలు, రూ. 50,000 నగదు స్వాధీనం

కామారెడ్డి: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విద్యుత్ నగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును దేవునిపల్లి పోలీసులు సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన 16 తులాల బంగారు ఆభరణాలు, రూ. 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు:  

ఫిర్యాదురాలు మామిండ్ల లావణ్య, భర్త సురేష్ కుమార్, వయస్సు 42 సం, విద్యుత్ నగర్ కాలనీ, దేవునిపల్లి నివాసి. తేదీ 7.8.2026 ఉదయం 8:30 గంటలకు ఇంటికి తాళం వేసి తన తల్లి ఇంటికి వెళ్లారు. మరునాడు 8.8.2026 ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపు గొళ్ళెం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు బీరువా తాళం కూడా పగులగొట్టి ఉంది. పరిశీలించగా సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడి అరెస్ట్:  

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, సీసీఎస్ ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అనుమానాస్పద వ్యక్తి కదలికలను గుర్తించారు.  

ఈ రోజు మధుర నగర్ ఏరియాలో దేవునిపల్లి పోలీసు పెట్రోలింగ్ వెహికల్ చూసి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

విచారణలో నిందితుడు వడ్ల శ్రీనివాస్, వయస్సు 40 సం, దేవునిపల్లి, కామారెడ్డి నివాసిగా తేలింది. తన అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. తేదీ 07/08/2026న తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి, అదే రోజు రాత్రి పాత ఇంటి వద్ద ఉన్న ఇనుప రాడ్ తీసుకుని వెళ్లి, ఇంటి పక్కనున్న ఖాళీ స్థలం ద్వారా కాంపౌండ్ వాల్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించాడు. బెడ్‌రూమ్‌లోని బీరువా తాళాన్ని ఇనుప రాడ్‌తో పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.90,000 నగదు అపహరించినట్లు తెలిపాడు.  

స్వాధీనం చేసిన వస్తువులు:  

1. బంగారు నల్లపూసల త్రాడు  

2. బంగారు చైన్లు - 2  

3. బంగారు ఉంగరాలు - 7  

4. కమ్మల బుట్టలు - 1 జత  

5. కమ్మలు - 3 జతలు  

6. గోల్డ్ బిస్కెట్లు - 2  

7. గోల్డ్ బిస్కెట్ చిన్న ముక్కలు - 4  

8. మొబైల్ ఫోన్ - 1  

9. నగదు - రూ. 50,000

పోలీసులను అభినందించిన ఎస్పీ  

వారం రోజులలోనే చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలు, నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, సీసీఎస్ ఎస్‌ఐ మహేష్‌తో పాటు సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, దేవునిపల్లి సిబ్బంది రవికిరన్, రవిలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.



Post a Comment

أحدث أقدم