Top News

Vyshya Sangham | వైశ్యుల ప్రతిష్ట పెంచుతా - సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం

వైశ్యుల ప్రతిష్ట పెంచుతా - సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం  

సిద్ధిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిద్ధిపేట బ్యూరో, తెలంగాణ డైలీ న్యూస్ : ఆర్య వైశ్యుల ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తానని సిద్ధిపేట పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం అన్నారు. సంఘం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.

కర్మ భవన్ నిర్మాణానికి కృషి

కిరాయి ఇళ్లలో ఉంటున్న ఆర్య వైశ్యులకు ఇబ్బంది కలుగకుండా కర్మ భవన్ నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. కిరాయి ఇళ్లలో ఉంటున్న వైశ్య కుటుంబాలలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఆ ఇంటి యజమాని లోనికి తీసుకుని రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే కర్మ భవన్ నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

పట్టణంలో వైశ్యుల సంఖ్య బలాన్ని పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సంఘాన్ని బలోపేతం చేసి, వైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమం చివర్లో మిఠాయిలు పంపిణీ చేశారు.




Post a Comment

أحدث أقدم