Top News

Congress | వీరనారి చాకలి ఐలమ్మకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు

వీరనారి చాకలి ఐలమ్మకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు

బాన్సువాడలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు - తాడ్కోల్ రోడ్డులో విగ్రహానికి పూలమాల

ఐలమ్మ స్ఫూర్తితో సమానత్వం కోసం కృషి చేయాలి: ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు

బాన్సువాడ, సెప్టెంబర్ 10: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ చిరస్మరణీయమని అన్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిందని పేర్కొన్నారు.

పేదలు, రైతుల హక్కుల కోసం తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడిన ఐలమ్మ తెగువ మహిళా శక్తికి, సామాజిక న్యాయానికి ప్రతీక అన్నారు. అణగారిన వర్గాల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ ఏజాజ్, మహ్మద్ ఖలీక్, గోపాల్ రెడ్డి, మహ్మద్ గౌస్, నార్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم