Top News

Railway Manager | కామారెడ్డి రైల్వే గేటు 209/ఏ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలి - కాలనీవాసుల వినతి

కామారెడ్డి రైల్వే గేటు 209/ఏ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలి - కాలనీవాసుల వినతి

300 కుటుంబాలకు నష్టం, రోడ్డు లేకుండా పోతుందని ఆందోళన - స్టేషన్ మేనేజర్ కు వినతిపత్రం

కామారెడ్డి, సెప్టెంబర్ 10: కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీ, కె.పి.ఆర్ కాలనీ వాసులు రైల్వే గేటు నంబర్ 209/ఏ వద్ద చేపట్టనున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కామారెడ్డి రైల్వే స్టేషన్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ మేరకు కాలనీ వాసులు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, గత రైల్వే గేటు 209/ఏ గల దాని వద్ద ఓవర్ హెడ్ బ్రిడ్జి నిర్మాణముకు ప్రతిపాదించినట్లు తెలిసిందని, దానిని సర్వే చేసి మార్కింగ్ చేయడము జరిగిందని తెలిపారు. దీనికి గాను తమ ఇండ్లు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే జరిగితే దాదాపు మూడు వందల కుటుంబాలకు చెందిన ఇండ్లు, ప్లాట్లు కోల్పోయి తీవ్ర నష్టము జరిగి, తాము రోడ్డు పాలు అయ్యే అవకాశము ఉందని వాపోయారు.

Post a Comment

أحدث أقدم