Top News

Bodhan | బోధన్ లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

బోధన్ లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర 

పూజల్లో పాల్గొని, శోభాయాత్రను ప్రారంభించిన పోలీసులు

తాజ్/బోధన్, సెప్టెంబర్ 25:బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.

బోధన్ ACP, CI, SI లు గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. మండప నిర్వాహకులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు, శోభాయాత్ర సజావుగా సాగేందుకు భక్తులకు దిశానిర్దేశం చేశారు.

పట్టణంలోని ప్రధాన వీధుల గుండా గణేష్ మూర్తుల శోభాయాత్ర కోలాహలంగా సాగుతోంది. భక్తులు డప్పు చప్పుళ్లు, భజనలతో, "గణపతి బప్పా మోరియా" నినాదాలతో నిమజ్జన ఘాట్ వైపు కదులుతున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

Post a Comment

أحدث أقدم