కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన పర్యవేక్షణ
200 సీసీ కెమెరాలతో నిఘా - సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు
తాజ్ /నిజామాబాద్, సెప్టెంబర్ 25:వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య కమాండ్ కంట్రోల్ హాల్ నుండి 200 సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
నగరంలోని ప్రధాన రహదారులు, నిమజ్జన మార్గాలు, విగ్రహాల తరలింపు ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నిమజ్జన కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జనాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సీపీ సూచించారు.

إرسال تعليق