Top News

DEO | DEO కు SGT యూనియన్ వినతి

DEO కు SGT యూనియన్ వినతి - G.O 25 సవరించాలి : అయ్యాల సంతోష్ 

కామారెడ్డి, సెప్టెంబర్ 25 : జిల్లా విద్యాధికారి (DEO) మల్లికార్జున్ కి SGT యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమిశెట్టి రాములు, అయ్యాల సంతోష్ లు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

- G.O 25 ను సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని,

- టీచర్ల సర్దుబాటులో అవకతవకలు లేకుండా చూడాలని,

- హైస్కూల్లో ఉన్న SGT లను ప్రైమరీ పాఠశాలల్లో పని చేసే విధంగా అవకాశం కల్పించాలని కోరారు.

DDO ల తీరుపై ఫిర్యాదు:

SGT ఉపాధ్యాయుల నెలవారీ శాలరీ బిల్లులు, ఇంక్రిమెంట్లు, సర్వీస్ బుక్స్ పనులను కొందరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు (DDOలు) బాధ్యతగా చేయకుండా, కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.

కొందరు DDO లు తమ లాగిన్ User ID, Password లను ఇతరులకు ఇస్తున్నారని, ఫోన్ నంబర్లు కూడా DDO లకు సంబంధించినవే ఉండాలని, శాలరీలు, ఇంక్రిమెంట్లు, సర్వీస్ బుక్స్ ను సంఘ నాయకుల చేత సంవత్సరానికి ఎంతో కొంత ముడుపులు ఇచ్చి రాయించుకుంటున్నారని, అలా పని చేసిన సంఘ నాయకులు SGT ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. అలాంటి DDO లను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని DEO ను కోరారు.

Post a Comment

أحدث أقدم