మంత్రి సీతక్క సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, సెప్టెంబర్ 25: ఈ నెల 28వ తేదీ సోమవారం కామారెడ్డి వేదికగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క నిర్వహించనున్న సమీక్షా సమావేశ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో వేదిక ఏర్పాట్లు, శాఖల వారీగా నివేదికల సిద్ధం, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
అన్ని శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పురోగతి, పెండింగ్ అంశాలు, సాధించిన లక్ష్యాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25 కు మార్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, డీఆర్ఓ పాండు, ఏఓ మసూద్ హైమద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

إرسال تعليق