బోర్లంలో అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం
దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల డిమాండ్
బోర్లం(బాన్సువాడ), సెప్టెంబర్ 13: భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోర్లం గ్రామంలో దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు ఆందోళన చేపట్టారు.
ఈరోజు బోర్లం అంబేద్కర్ చౌరస్తాలో అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ ఫలాలను పొందుతూనే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను కించపరుస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్న అమర ప్రసాద్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
తాను చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల దళిత బహుజన వర్గాల చేతిలో చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బహుజన సంఘాలు అమర ప్రసాద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోర్లం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కమ్మరి నర్సింలు, గ్రామ సర్పంచ్ మన్నే రమేష్, మాజీ సర్పంచ్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్. నర్సింలు, గొబ్బురు జనార్దన్ రెడ్డి, దళిత బీసీ సంఘాల నాయకులు మంద శ్రీనివాస్, మమ్మాయి లక్ష్మణ్, బొప్పని శీను, మన్నే చిన్న సాయిలు, మన్నే అనిల్ కుమార్, పోతురాజు లింగం, మన్నే ఐకేపీ సాయిలు, కల్లూరి రాజారామ్, ఎర్రోళ్ల బాలు, గుజ్జరి నాగరాజు, డాక్టర్ సాయిలు, మన్నె నాగభూషణం, కమ్మరి గంగారం, వెంకటరత్నం, మన్నె సురేష్, మన్నే విట్టల్, బేగరి సెంట్రింగ్ సాయిలు, మన్నే సాయిప్రసాద్, ఎన్. విష్ణు, శివ సంగమేశ్వర్, ముస్లిం మైనార్టీ యువకులు సయ్యద్ నిసార్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق