Top News

Fake Certificates | బోధన్ లో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు

బోధన్ లో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు - ఇద్దరు అరెస్ట్

మీ సేవా కేంద్రంగా సర్టిఫికేట్ల తయారీ 

రెండేళ్లుగా సాగుతున్న దందా 

బోధన్, సెప్టెంబర్ 05: బోధన్ పట్టణంలో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు రట్టు చేశారు. రాకాసిపేట్ లోని సహారా మీ సేవ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

కేసు వివరాలు:

బోధన్ రాకాసిపేట్ పెద్ద మసీదు దగ్గర గల సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో నిజామాబాద్ సీపీ ఆదేశాల మేరకు CCS ACP శ్రీశైలం, CCS సిబ్బంది, బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తనిఖీలో మీ సేవ ఆపరేటర్  తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో గత రెండేళ్లుగా మీ సేవ యజమానితో కలిసి ఇంటి వద్ద, సెంటర్ లో నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. ఒరిజినల్ సర్టిఫికెట్ల మాదిరిగానే రబ్బర్ స్టాంపులు వేసి ఒక్కో సర్టిఫికెట్ కు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసి పంచుకునేవారు. ఈ నకిలీ సర్టిఫికెట్లను ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం వినియోగించేవారని విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1. తయారు చేసిన నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు - 05

2. ఇప్పటికే ఇచ్చిన నకిలీ జనన ధృవీకరణ జిరాక్స్ పత్రాలు - 22

3. తయారీకి ఉంచిన ఖాళీ ఒరిజినల్ సర్టిఫికెట్లు - 38

4. రబ్బర్ స్టాంప్ - 01

5. నకిలీ TC, బోనఫైడ్ లు - 13

6. షాదీ ముబారక్ కు సంబంధించిన నకిలీ జిరాక్స్ - 01

7. HP ల్యాప్ టాప్ - 01, Canon కలర్ ప్రింటర్ - 01, సెల్ ఫోన్లు - 02

నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న మిగతా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ కేసును ఛేదించిన CCS సిబ్బంది CI అజయ్, SI శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్స్ అనిల్, గంగప్రసాద్, బోధన్ ACP శ్రీనివాస్, బోధన్ టౌన్ CI వెంకట నారాయణ, SI L. రామ్, కానిస్టేబుల్స్ గంగారం, శివకృష్ణ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.



Post a Comment

أحدث أقدم