Top News

Financial Advice | ఆరోగ్యం, పొదుపు, పెట్టుబడి ప్రణాళిక తప్పనిసరి : ఆర్థిక నిపుణులు నరేష్ పుడారి

ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది 

ఆరోగ్యం, పొదుపు, పెట్టుబడి ప్రణాళిక తప్పనిసరి : ఆర్థిక నిపుణులు నరేష్ పుడారి

కామారెడ్డి, సెప్టెంబర్ 14: మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సంపాదనలో సరైన పద్ధతిలో కేటాయింపులు చేసుకోవడం నేటి అత్యవసర పరిస్థితి అని ఆర్థిక సలహాదారులు, వారాహి అసోసియేట్ ఫౌండర్ నరేష్ పుడారి అన్నారు.

రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం పాటించాల్సిన మూడు ముఖ్యమైన సూత్రాలను ఆయన వివరించారు.

1. హెల్త్ ఇన్సూరెన్స్ - ఎంత కవరేజ్ అవసరం?

ఈరోజుల్లో వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఏటా 12% నుండి 15% వరకు పెరుగుతోంది. సాధారణ సర్జరీలు లేదా అత్యవసర చికిత్సలకే లక్షల్లో ఖర్చవుతోంది.

- కనీస కవరేజ్: నలుగురు సభ్యులున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి నేటి పరిస్థితుల్లో కనీసం రూ.10 లక్షల నుండి రూ.25 లక్షల వరకు కవరేజ్ ఉండటం తప్పనిసరి.

- బెస్ట్ స్ట్రాటజీ: బేస్ పాలసీకి Super Top-up దానికి రూ.50 లక్షల వరకు బోనస్ జోడిస్తే తక్కువ ప్రీమియంతోనే దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బలమైన ఆరోగ్య రక్షణను పొందవచ్చు. ఆరోగ్య బీమా అనేది ఖర్చు కాదు, కష్టపడి కూడబెట్టిన సంపదను ఆపదలో కాపాడే రక్షణ కవచం అని ఆయన అన్నారు.

2. సేవింగ్స్ & ఎమర్జెన్సీ ఫండ్ - ఎంత చేయాలి?

ఆర్థిక సూత్రాల ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కనీసం 20% నుండి 30% భవిష్యత్తు కోసం తప్పక కేటాయించాలి.

ఉద్యోగ మార్పు, వ్యాపారంలో ఒడిదుడుకులు వంటి అనుకోని సంక్షోభం ఎదురైతే కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం 6 నెలల నుండి 12 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంకు ఎఫ్‌డీ రూపంలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

పై సూచనలను పాటిస్తే ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందని నరేష్ పుడారి తెలిపారు.



1 تعليقات

إرسال تعليق

أحدث أقدم