Top News

Matti Ganapathi | భిక్నూర్ లో భక్తిశ్రద్ధలతో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ

భిక్నూర్ లో భక్తిశ్రద్ధలతో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు - యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్

భిక్నూర్, సెప్టెంబర్ 12: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భిక్నూర్ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భారతి ఫౌండేషన్ చైర్మన్, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ, వినాయక చవితి భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యతను చాటే పవిత్రమైన పండుగ అని అన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం శుభఫలితాలను ఇస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చని తెలిపారు. భక్తి శ్రద్ధలతో గణనాథుడిని పూజిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం అనే సందేశంతో భారతి ఫౌండేషన్ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రేఖ, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్ రెడ్డి, భీంరెడ్డి, సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గలిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, NSUI జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాజబాబు మిత్రబృందం సభ్యులు తాళ్ల శ్రీను, చింత తీర్మాల్, రాకేష్, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ సిద్ధారెడ్డి, సతీష్, బోండ్ల వెంకటేష్, జెట్టి భారత్ కుమార్, బండి ప్రవీణ్, శ్రీకాంత్, బోండ్ల శ్రీకాంత్, ఉప్పరి సందీప్, శివ, గౌడ సంఘం అధ్యక్షులు సిద్దగౌడ్, ఎల్లగౌడ్, స్వామి గౌడ్, నారగౌడ్, గంగగౌడ్, నర్సాగౌడ్, రవి కుమార్ గౌడ్, మురళీగౌడ్, చిరంజీవి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, బాగారెడ్డి, సిద్దారం, జీవన్, ప్రదీప్, లోకేష్, జనార్దన్ రెడ్డి, యాదవరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






Post a Comment

أحدث أقدم