Top News

Minister Seethakka | కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

 

కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

భూకొనపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు - శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మంగళవారం పర్యటించారు.

పర్యటనలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో ఉన్న భూకొనపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మంజూరైన రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు కలిసి పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

అలాగే రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూదాన్ హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులకు కూడా మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మొక్కలు నాటారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల భవనానికి కూడా మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.

అలాగే వర్కింగ్ ఉమెన్స్ కోసం నిర్మించిన నూతన హాస్టల్ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఈ పర్యటనలో ఆలయ పునర్నిర్మాణం, ప్రభుత్వ పాఠశాల భవనం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, వన మహోత్సవ కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మండల అధ్యక్షులు రాజగౌడ్, కృష్ణారావు, సొసైటీ చైర్మన్లు గూడెం శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి, భీంరెడ్డి, సుధాకర్, స్థానిక కౌన్సిలర్ గంగాధర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కౌన్సిలర్లు అంజాద్, మజీద్, వాజీద్, జావీద్, సత్యం, చిట్టీబాబు, మహేష్, లడ్డు, కో-ఆప్షన్ మెంబర్ అలీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీను, మండల అధ్యక్షులు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు పండ్ల రాజు, సర్పంచ్ రేఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, అశోక్ రెడ్డి, గంప ప్రసాద్, తిరుమల స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, లక్ష్మి, సుతారి రమేష్, యాదవరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

أحدث أقدم