Top News

No ROB-Its RUB | కామారెడ్డి రైల్వే గేటు 209/ఏ వద్ద ఆర్ఓబీ కాదు... ఆర్ యూ బి నిర్మిస్తాం - ఎంపీ సురేష్ శెట్కార్ స్పష్టీకరణ

కామారెడ్డి రైల్వే గేటు 209/ఏ వద్ద ఆర్ఓబీ కాదు... ఆర్ యూ బి నిర్మిస్తాం - ఎంపీ సురేష్ శెట్కార్ స్పష్టీకరణ

ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలంటూ కాలనీవాసుల వినతి - స్పందించిన ఎంపీ

కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని రైల్వే గేటు నంబర్ 209/ఏ వద్ద చేపట్టనున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై కాలనీ వాసుల ఆందోళనకు ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ స్పష్టత ఇచ్చారు. అక్కడ ఆర్ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కాదు, ఆర్ యూ బి (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మిస్తామని పేర్కొన్నారు.

మంగళవారం అశోక్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీ, కెపిఆర్ కాలనీ వాసులు రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఎంపీ సురేష్ శెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రి సీతక్కలకు వినతిపత్రం అందజేశారు.

దీనిపై స్పందించిన ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ, ఆర్ఓబీ నిర్మిస్తున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అశోక్ నగర్ నుంచి కలెక్టరేట్ కు వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున, తాను ఇటీవల సికింద్రాబాద్ లో రైల్వే ఎస్సీ తో జరిగిన సమావేశంలో, అలాగే రైల్వే మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఇక్కడ ఆర్ యూ బి  నిర్మించాల్సిన అవసరం ఉందని కోరినట్లు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు.

అధికారులు పొరపాటున ROB సర్వే చేశారని, ఇప్పుడే వారితో మాట్లాడానని తెలిపారు. RUB వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇళ్లకు ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. రాజంపేట ఓల్డ్ రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ బ్రిడ్జిని నిర్మిస్తామని, షబ్బీర్ అలీ, తన కృషి వల్లనే ఈ రెండు బ్రిడ్జిలు మంజూరయ్యాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.వీడియో 👇


కాలనీ వాసుల వినతి:

గతంలో రైల్వే గేటు 209/ఏ వద్ద ఓవర్ హెడ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించి సర్వే చేసి మార్కింగ్ చేశారని, దీని కోసం తమ ఇళ్లు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతోందని తెలిసిందని కాలనీ వాసులు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇదే జరిగితే దాదాపు మూడు వందల కుటుంబాలకు చెందిన ఇళ్లు, ప్లాట్లు కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


============

 ROB=RUB   తేడా ఏంటి?

ROB అయితే - ఎత్తుగా ఫ్లైఓవర్ లా కడతారు. దీనికి ఇరువైపులా చాలా స్థలం కావాలి, ఇళ్లు, ప్లాట్లు పోవచ్చు. అందుకే కాలనీ వాసులు ఆందోళన చెందారు.

RUB అయితే - పట్టాల కింద నుండి దారి తీస్తారు. ఇళ్లు కోల్పోయే సమస్య తక్కువ, ఖర్చు తక్కువ.

అందుకే ఎంపీ సురేష్ శెట్కార్ - కామారెడ్డి గేటు 209/ఏ వద్ద ROB కాదు, RUB నే కడతాం, ఎవరికీ నష్టం ఉండదు అని స్పష్టం చేశారు.

============



Post a Comment

أحدث أقدم