బాన్సువాడలో 16న జాతీయ సమైక్యతా సదస్సు
పోస్టర్ విడుదల, అన్ని మతాలు, రాజకీయ నాయకులు హాజరు
మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహణ
బాన్సువాడ, సెప్టెంబర్ 07:
బాన్సువాడ పట్టణ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హిందూ-ముస్లిం ఐక్యతను చాటేందుకు మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి), కొయ్యగుట్ట, బాన్సువాడ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యతా సదస్సు (ఖౌమీ యక్జెహతీ కాన్ఫరెన్స్) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ముఫ్తి ఉమర్ బిన్ ఈసా తెలిపారు.
ఈ చారిత్రాత్మక బహిరంగ సభ 16 సెప్టెంబర్ 2026 బుధవారం సాయంత్రం మగ్రిబ్ తర్వాత రాత్రి 7 గంటలకు మార్కెట్ యార్డ్ గంజ్, మెయిన్ రోడ్ బాన్సువాడ, కామారెడ్డి జిల్లాలో జరగనుంది.
ఈ సభకు అధ్యక్షత వహించనున్న వారు హజ్రత్ మౌలానా గులాం యజ్దానీ సాహెబ్, ముఫ్తీ ఉమర్ బిన్ ఖాసిమీ సాహెబ్ మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్.
అన్ని మతాల ప్రముఖులు:
హిందూ ధర్మ ప్రముఖులు డాక్టర్ యుగం పవన్ కుమార్ శర్మ, క్రైస్తవ మత పెద్దలు ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వర్ సొల్పూర్ ( ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్), సిక్కు మత ప్రముఖులు సర్దార్ రాఖీందర్ సింగ్ (అధ్యక్షులు, గురుద్వారా నిజామాబాద్), అమృతం వీరబ్రహ్మం (నడూరు హోమన్ రైడర్, కౌన్సిల్ ఫర్ ఇండియా) పాల్గొననున్నారు.
రాజకీయ ప్రముఖులుగా:
మొహమ్మద్ అలీ షబ్బీర్, (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు), సురేష్ కుమార్ షెట్కార్ (ఎం.పి. జహీరాబాద్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ), కాసుల బాలరాజ్ (చైర్మన్ ఆగ్రోస్) హాజరుకానున్నారు
ఇస్లామిక్ స్కాలర్లు:
ముఫ్తీ మౌలానా సల్మాన్ సాహెబ్ అహ్మద్ అబ్రార్ దానిష్, ఖాబిల్ ఖదర్ జనాబ్ మహ్మద్ అర్ఫోజ్ సాహెబ్, మొహ్తరం ముకర్రం జనాబ్ అబ్దుల్ అలీమ్ సాహెబ్, మొహ్తరం ముకర్రం జనాబ్ అబ్దుల్ వహీద్ సాహెబ్, మౌలానా కరీముద్దీన్ కమాల్ ఖాద్రీ సాహెబ్ నిజామాబాద్.
జాతీయ సమైక్యత మనందరి ఉమ్మడి బాధ్యత అని, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవాన్ని చాటే ఈ కార్యక్రమానికి బాన్సువాడ పరిసర ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆహ్వానంలో భాగంగా చర్చి యాజమాన్యాన్ని కలవగా వారు సదస్సుకు హాజరవుతామని హామీ ఇచ్చారు.
జాతీయ సమైక్యతా సదస్సుకు ఆహ్వానం
హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు - అందరం అన్నదమ్ములం, హమ్ సబ్ హై భాయి భాయి అనే సోదరభావం, జాతీయ ఐక్యత, పరస్పర సౌభ్రాతృత్వాన్ని చాటేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మదరసా నిర్వాహకులు తెలిపారు. బాన్సువాడ పరిసరాల్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హిందూ, ముస్లిం సమైక్యత, ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక బాధ్యత కలిగిన ప్రముఖులు, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ తదితర అన్ని మతాల పెద్దలు హాజరు కానున్నారు. ప్రముఖ వక్తలు, మత పెద్దలు ప్రసంగించనున్నారు.
జాతీయ సమైక్యతా సదస్సు ఆహ్వానంలో భాగంగా నిర్వాహకులు బాన్సువాడ చర్చిని సందర్శించారు. చర్చి యాజమాన్యం వారిని ఘనంగా స్వాగతించి, సదస్సుకు తప్పకుండా హాజరవుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి, ప్రేమ, సోదరభావంపై చర్చించారు. ఇది పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలిచింది.
బాన్సువాడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్ నిర్వాహకులు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షాదీఖనా చైర్మన్ అబ్దుల్ వహాబ్, అఫ్రోజ్, ముఫ్తి ఉమర్ బిన్ ఈసా, నవీద్, ఇమ్రాన్, ఈసా తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతయే బలం - జాతీయ సమైక్యత కలిసి రండి అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.




إرسال تعليق