నవోదయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నిజాంసాగర్ : నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ సీతారాంబాబు తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం
అర్హులైన విద్యార్థులు 2026 సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించి, అవసరమైన వివరాలను నమోదు చేసి దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.
9వ తరగతి ప్రవేశాలకు:
https://cbseitms.nic.in/2026/nvsix9/
11వ తరగతి ప్రవేశాలకు:
https://cbseitms.nic.in/2026/nvsix11/
అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ప్రిన్సిపల్ సీతారాంబాబు తెలిపారు.

إرسال تعليق