Sc St Journalists| బీర్కూర్ లో హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా ధర్నా, రాస్తారోకో

 

బీర్కూర్ లో హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా ధర్నా, రాస్తారోకో

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు - కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

బీర్కూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్ట్ అసోసియేషన్ నేత గంగన్న ఆధ్వర్యంలో నిరసన

బీర్కూర్ / బాన్సువాడ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా బీర్కూర్ లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో గురువారం బీర్కూర్ మండల కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీర్కూర్ - బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. (Video 👇)


ఈ సందర్భంగా గంగన్న మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక కల్పిత నాయకుడని, ఆయనపై పుస్తకం రాస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన హమారా ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రపంచ మేధావి, 32 డిగ్రీలు సాధించిన అంబేద్కర్ ను విమర్శించే అర్హత హమారా ప్రసాద్ కు లేదని అన్నారు. దళిత సంఘాల ఉద్యమం నేపథ్యంలో జరిగిన అరెస్టు కేవలం లాంఛనమేనని, ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. హమారా ప్రసాద్ వెనుక ఉన్న శక్తులను బహిర్గతం చేయాలని, ఆయన వెనుక ఉంటూ మాట్లాడిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ తో పాటు మహనీయులపై విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, కుర్రి కృష్ణ, ప్రవీణ్ గౌడ్, దళిత నాయకులు వెండి యాదవ రావు, కొరిమె రఘు, బంగారు రవి, నల్లజెరు బాలరాజు, మెక్క రమేష్, లింగమయ్య, పట్వారి గంగారాం, నీరడి రాములు, బోయి చిన్న సాయిలు, పిడుగు బసంత్, మెక్క శివరాజ్, శంకర్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم