Top News

NZB Press Club | మహిళా జర్నలిస్టులపై దాడిని ఖండించిన నిజామాబాద్ జర్నలిస్టులు

మహిళా జర్నలిస్టులపై దాడిని ఖండించిన నిజామాబాద్ జర్నలిస్టులు 

ఢిల్లీ పోలీసుల చర్య హేయమైన చర్య అంటూ నిరసన

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్

నిజామాబాద్, సెప్టెంబర్ 07: ఢిల్లీలో ముస్లిం మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ జర్నలిస్ట్ సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు.

ఉదయం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను కలిసి జర్నలిస్ట్ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కలెక్టరేట్ ఆవరణలో, అంబేద్కర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ప్రెస్ క్లబ్ బ్యానర్ తో నిరసన తెలిపారు. Video👇


ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్, ఉర్దూ జర్నలిస్ట్ సంఘాల సీనియర్ నాయకుడు పప్పా ఖాన్ మాట్లాడుతూ...సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులపై పోలీసులే దాడి చేయడం హీనమైన చర్య అని మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్ షహీన్ నఫీజ్ పై కులం, మతం దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వైద్యులపై దాడులు జరిగితే వైద్య ఆరోగ్య శాఖ ఒత్తిడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకొచ్చినట్లే, అక్రమాలను బయటపెడుతూ, ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న వారి భాగోతాలను వార్తల రూపంలో ప్రజలకు తెలియజేస్తున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

దాడికి పాల్పడిన ఢిల్లీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని తక్షణమే విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, రాజు, భాస్కర్ గౌడ్, స్వామి, ప్రీతం రెడ్డి, రవిచరణ్ రెడ్డి, రతన్ రెడ్డి, వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు అరవింద్ బాలాజీ, పాకాల నరసింహులు, మహేందర్, కళ్యాణ్, ప్రేమ్ కుమార్, రాజేష్, సందీప్, గణేష్, విజయ్, ఉర్దూ జర్నలిస్టులు ఖాలేద్, లక్కీ, ఫోదిన్, హెచ్.ఫీస్, షకీల్, మజీద్ భాయ్, అఖిల్, యూనస్, యాసీన్, ఉస్మాన్ భాయ్, నదీమ్, గఫార్, యూసుఫ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم