కామారెడ్డి క్రీడాకారుడికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
WAKO పారా నేషనల్ కిక్ బాక్సింగ్ కు ఎంపిక
కామారెడ్డి, సెప్టెంబర్ 09: కామారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని చాటాడు. గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతిష్టాత్మక WAKO 1వ పారా నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కు ఎంపికయ్యాడు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా ఈ నెల 11, 12 తేదీలలో WAKO India ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇందులో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించనున్న అరవింద్ కుమార్ కు కోచ్ గా ఆశమ్మల సూర్యప్రసాద్ వ్యవహరించనున్నారు. వీరితో పాటు అర్జున్, ఉదయ కిరణ్ బృందంగా వెళ్తున్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మూడ పవన్, జనరల్ సెక్రటరీ సూర్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించి కామారెడ్డి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాభిమానులు, అసోసియేషన్ ప్రతినిధులు అరవింద్ కుమార్ కు అభినందనలు తెలిపారు.

إرسال تعليق