Top News

SGT Teachers | ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి : అయ్యాల సంతోష్

హన్మాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుల నిరసన

ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి : అయ్యాల సంతోష్ 

బాన్సువాడ, సెప్టెంబర్ 09: హన్మాజీపేట్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎస్జీటీ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా SGT యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ, SGT ఉపాధ్యాయుల సమస్యలు సాధించుకోవడానికి అందరూ ఏకం కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

ప్రధాన డిమాండ్లు:

- ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించే విధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 25ను సవరించాలి.

- 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.

- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి.

- పండిత్ గ్రేడ్ ప్రమోషన్లలో ఎస్జీటీలకు అవకాశం కల్పించాలి.

- ఐదు, ఆరు పాఠశాలలకు కలిపి ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ ను ఇవ్వాలి.

- హైస్కూల్లో పనిచేస్తున్న ఎస్జీటీలను రిలీవ్ చేసి ప్రాథమిక పాఠశాలలకు పంపాలి.

- PRC, DA లను వెంటనే అమలు చేయాలి.

డిమాండ్లు నెరవేర్చకుంటే పెన్ డౌన్, చాక్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి ఉద్యోగులు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు ప్రవీణ్, ముజామిల్, దశరథ్, శైలజ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم