Top News

Vinayaka Chavithi | ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు - పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సందేశంలో గణపతి బప్పా ఆశీస్సులతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

విఘ్నాలను బాపే ఆ విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు మనందరికీ లభించి, ఈ పర్వదినాన ప్రతి కుటుంబం ఆ వినాయకుని ఆశీస్సులు పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా మాజీ డీసీసీబీ చైర్మన్, నిజామాబాద్, బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పోచారం భాస్కర్ రెడ్డి కూడా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని దీవెనలతో అందరి జీవితాల్లో విజయాలు, శుభాలు కలగాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన శుభాకాంక్షల పోస్టర్లను సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.



Post a Comment

أحدث أقدم