మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా
ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు
నిందితుడు కాలే పండురంగా దోషిగా నిర్ధారణ - న్యాయం కోసం పోలీసుల కృషి
తాజ్/ నిజామాబాద్, 15 అక్టోబర్: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు కాలే పండురంగా కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు. రూ.5,000 జరిమానా కూడా విధించారు.
కేసు వివరాలు: బాధిత బాలిక తల్లి 18-03-2021న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది.
విధించిన శిక్షలు:
IPC సెక్షన్ 376AB: 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
POCSO చట్టం సెక్షన్ 5(m) r/w 6: 20 ఏళ్ల జైలు + రూ.5,000 జరిమానా
మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. బాలలపై నేరాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
![]() |
| Advertisement |


إرسال تعليق