RTC BPMM | బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బీపీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటన

బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బీపీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటన

బీఎంఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కైలాష్ చంద్ మాలిక్

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనాలి, పాత పెన్షన్ అమలు చేయాలి - డిమాండ్

బాన్సువాడ, 15 అక్టోబర్: తెలంగాణ పర్యటనలో భాగంగాభారతీయ పరివాహన్ మజ్దూర్ మహాసంఘ్ BPMM ఆల్ ఇండియా (RTC) ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కైలాష్ చంద్ మాలిక్ గురువారం బాన్సువాడ డిపోలో పర్యటించారు.

ఆయన వెంట బీపీఎంఎం ఉపాధ్యక్షులు ఆర్. వెంకట్ రెడ్డి, కార్మిక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవీందర్ గౌడ్, బాన్సువాడ డిపో అధ్యక్షులు ధర్మపాల్, కార్యదర్శి తులసీరామ్, మారుతి, మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి విజయ, గోపికృష్ణ, హనుమాన్లు, శివ, రతన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీలో బీఎంఎస్ తరఫున మొదటిసారి పోటీ చేసి అత్యుత్తమ ఓట్లు సాధించిన బీఎంఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం మాలిక్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆర్టీసీలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే నెల 18న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم