Auto Union |రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.డి. యూనుస్ నియామకం

రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.డి. యూనుస్ నియామకం

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు

ఎల్లారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎస్.డి. యూనుస్‌ను నియమించినట్లు ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ తెలిపారు.

ఎల్లారెడ్డిలో జరిగిన కామారెడ్డి జిల్లా సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డిలోని గ్రామ, మండల కమిటీలను పూర్తిగా నిర్మాణం చేయాలని ఆదేశించారు.

అలాగే రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులో భాగంగా భవిష్యత్తు పోరాటాలకు ఆటో డ్రైవర్లను సిద్ధం చేయాలని, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా జిల్లాలో పోరాటాలను ఉదృతం చేయాలని యూనుస్‌ను ఆదేశించారు.

తన నియామకానికి కృషి చేసిన నాయకులకు యూనుస్ కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

أحدث أقدم