కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అక్టోబర్ 24 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ - కలెక్టర్ ఉత్తర్వులు
వెబ్ సైట్ లో అందుబాటులో పూర్తి వివరాలు
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ (National AYUSH Mission) కింద ఆయుష్ ప్రజారోగ్య కార్యక్రమాల అమలు కోసం వివిధ కేటగిరీలలో మొత్తం 8 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు.
ఈ నియామకాలు 31.03.2027 వరకు, డైరెక్టర్, ఆయుష్ శాఖ, తెలంగాణ, సికింద్రాబాద్ వారి పరిపాలనా నియంత్రణలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
- పీజీ అర్హత కలిగిన ఆయుష్ డాక్టర్ - 1 పోస్టు - రూ.60,000/-
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ - 2 పోస్టులు - రూ.40,000/-
- డైటీషియన్ - 1 పోస్టు - రూ.20,000/-
- సైకోసోషియల్ కౌన్సిలర్ (ఆన్ కాల్) - 1 పోస్టు - ఒక్కో సెషన్ కు రూ.500/-
- యోగా ప్రొఫెషనల్ - 1 పోస్టు - రూ.28,000/-
- మల్టీ పర్పస్ వర్కర్ (MPW) - 2 పోస్టులు - రూ.15,000/-
దరఖాస్తుదారులకు ముఖ్య సూచనలు:
1. ప్రతి పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ఫారం, అర్హతలు కామారెడ్డి జిల్లా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్: https://kamareddy.telangana.gov.in
2. కనీస వయస్సు 18, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు (01.07.2026 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
3. దరఖాస్తులను 24.10.2026 నుండి 31.10.2026 వరకు సమర్పించాలి. పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా "రూమ్ నెంబర్ 25", ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ (IDOC), కామారెడ్డి జిల్లా కార్యాలయానికి పంపాలి.
4. 31.10.2026 తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోరు.
అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి కోరారు.
![]() |
| Advt |


إرسال تعليق