కామారెడ్డిలో హోంగార్డు మృతి - విధుల్లో ఉండగా ఫిట్స్ తో కుప్పకూలి మృతి
కామారెడ్డి, 18 అక్టోబర్: కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లింగంపేట గ్రామ నివాసి షేక్ మసూద్ అహ్మద్ (షేక్ ఛోటు) ఆదివారం విధుల్లో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యులు పరిశీలించి మృతిగా ధృవీకరించారు.
సోమవారం మధ్యాహ్నం వారి స్వస్థలమైన లింగంపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడికి పెళ్లికి ఎదిగిన కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు, భార్య ఉన్నారని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు.
![]() |
| Advertisement |


إرسال تعليق