ఇప్పటివరకు 13 దరఖాస్తులు - జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి వెల్లడి
16న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా కేటాయింపు
కామారెడ్డి, అక్టోబర్ 8:
బిచ్కుంద ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మున్సిపాలిటీలో తెలంగాణ బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులను జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. ముకుంద రెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు మొత్తం 13 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తు విధానం:
- ఫారం - I తో పాటు రూ. లక్ష డీడీని బదిలీ చేసి చెల్లించాలి
- 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జతచేయాలి
- ఈ నెల 12 లోపు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనిదినాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు
- ఏడాదికి రూ. 30 లక్షల ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వానికి విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


إرسال تعليق