Collector & SP in Batukamma | కామారెడ్డి జిల్లాలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

కామారెడ్డి జిల్లాలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు - మహిళా ఉద్యోగులతో కలిసి ఆడిపాడిన కలెక్టర్, ఎస్పీ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ - ప్రజలకు శుభాకాంక్షలు

కామారెడ్డి, 15 అక్టోబర్: కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వేర్వేరుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జిల్లా కలెక్టరేట్ లో: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకలాపాలతో బిజీబిజీగా గడిపే కలెక్టరేట్ లో సాయంత్రం మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మోగింది. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఎన్ వై గిరి, విక్టర్ ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

 

జిల్లా పోలీస్ కార్యాలయంలో: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

రెండు కార్యక్రమాల్లోనూ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ కార్యాలయ వేడుకల్లో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీ మధుసూదన్, ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కుమార్, ఇన్స్ పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. Video 👇



Post a Comment

أحدث أقدم