నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ బియ్యం పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట, అక్టోబర్ 9:
లింగంపేటలోని ఉమా మహేశ్వర్ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం మిల్లింగ్ ప్రక్రియ, కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) పంపిణీ పురోగతిని పరిశీలించారు.
ఎఫ్సీఐ, పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేయాల్సిన నిల్వలు, ఇప్పటివరకు పంపిణీ చేసిన పరిమాణం, పెండింగ్ వివరాలపై సమీక్షించారు. పెండింగ్ సీఎంఆర్ బియ్యాన్ని వేగవంతం చేసి ప్రభుత్వ గడువులోగా పూర్తి చేయాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ తనిఖీలో ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
==========
నాగన్న గారి బావి పరిసరాల్లో పారిశుద్ధ్యం పక్కాగా చేపట్టాలి: కలెక్టర్లింగంపేట, అక్టోబర్ 9:
లింగంపేట మండలంలోని చారిత్రక నాగన్న గారి బావిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.
బావి పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్రతకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆహార పదార్థాల వినియోగం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ ప్రవీణ్, మండల స్పెషల్ ఆఫీసర్ సురేందర్ పాల్గొన్నారు.
=======
విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్లింగంపేట, అక్టోబర్ 9:
లింగంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు.
విద్యార్థినులతో కలిసి భోజనం చేసి వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు. వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. అనంతరం నిల్వ గది, కళా గదులను పరిశీలించి, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు.
పాఠశాలలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారిని ఆదేశించారు. క్రీడా వసతుల కోసం ఆటస్థలాన్ని చదును చేయడానికి రూ.3 లక్షల నిధులు మంజూరు చేశారు. నాణ్యమైన విద్య, పరిశుభ్ర వాతావరణం, భోజనం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సాహం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ మల్లికార్జున్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, సర్పంచ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






إرسال تعليق