Dassera Wishes By Collector | బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుభాకాంక్షలు

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుభాకాంక్షలు

ప్రకృతిని ఆరాధిస్తూ సామూహిక ఐక్యతను చాటే పండుగ బతుకమ్మ: కలెక్టర్

ప్రజలు పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, 19 అక్టోబర్: రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ, విజయదశమి (దసరా) పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, మహిళలు, యువతులు, బాలికలు తొమ్మిది రోజుల పాటు సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకోవడం తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ సామూహిక ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

విజయదశమి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని, దసరా ప్రతి ఒక్కరిలో నూతనోత్సాహాన్ని నింపి మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు.

--------------

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

21 ఫిర్యాదులు స్వీకరణ - పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం

కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి, 19 అక్టోబర్: కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 21 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని, పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చూడాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సీఈఓ చందర్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advt 


Post a Comment

أحدث أقدم