PBR In Mini Stadium | దసరా వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు

దసరా వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు - బాన్సువాడలో రావణ దహన కార్యక్రమ స్థలాన్ని పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి

జయశంకర్ మినీ స్టేడియంలో 20న దసరా వేడుకలు

పోలీసు అధికారులతో కలిసి ఏర్పాట్ల సమీక్ష

బాన్సువాడ, 19 అక్టోబర్: విజయదశమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణ కాష్ఠ దహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు  పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ డీఎస్పీ విఠల్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి లతో కలిసి కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم