బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ విక్టర్ కు వినతిపత్రం అందజేసిన రైతు ప్రతినిధులు
బాన్సువాడ:ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రం కానున్న నేపథ్యంలో బాన్సువాడ నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు.
బాన్సువాడ, వర్ని, రుద్రూర్, చందూర్, కోటగిరి, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, ముందస్తు కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు:
- కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
- భూగర్భ జలాలు, సాగునీటి లభ్యతపై సమగ్ర సర్వే చేపట్టాలి
- తక్కువ నీటితో పండే పంటల సాగును ప్రోత్సహించి శిక్షణ ఇవ్వాలి
- విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ సేద్యం, పంటల బీమాపై అవగాహన కల్పించాలి
- ప్రతి మండలంలో వ్యవసాయ అధికారుల ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచాలి
- పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలి
రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో మోచి గణేష్, బత్తిని సురేష్, గాండ్ల ప్రవీణ్, మంగలి రమేష్ తదితరులు ఉన్నారు.

إرسال تعليق