HC Pramotions | జిల్లా పోలీస్ శాఖలో ఏడుగురికి పదోన్నతులు

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఏడుగురికి పదోన్నతులు

బాధ్యతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ

కామారెడ్డి, అక్టోబర్ 25: జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బంది జిల్లా ఎస్పీ  ఎం. రాజేష్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతులు సిబ్బంది వృత్తిపరమైన ఎదుగుదలకు ప్రతీకలని, అదే సమయంలో వారి బాధ్యతలను మరింత పెంచుతాయని తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించాలని సూచించారు.

పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని, ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు.

పదోన్నతి పొందిన సిబ్బంది వివరాలు:

1. బి. రమేష్ – పీసీఆర్ కంట్రోల్ రూమ్

2. ఎం. సదయ్య – రామారెడ్డి పోలీస్ స్టేషన్

3. పి. రాధాకృష్ణ – బిచ్కుంద పోలీస్ స్టేషన్

4. టి. వీరబాబు – బీర్కూర్ పోలీస్ స్టేషన్

5. జి. సాయిలు – బాన్సువాడ పోలీస్ స్టేషన్

6. ఆర్. బన్సీలాల్ – లింగంపేట పోలీస్ స్టేషన్

7. కె. రమేష్ – లింగంపేట పోలీస్ స్టేషన్

Post a Comment

أحدث أقدم