RTC భూములపై సర్కారు పాగా - BMS ఆగ్రహం
హైదరాబాద్ లోని రూ.1000 కోట్ల విలువైన 6.5 ఎకరాల భూమి హౌసింగ్ బోర్డుకు - జీవో నెం.206ను వ్యతిరేకిస్తున్న BMS
నిజామాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన అత్యంత ఖరీదైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని BMS రాష్ట్ర నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ లో జరిగిన బిఎంఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర BMS అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ అంశంపై స్పందించారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న సుమారు రూ.1000 కోట్ల విలువైన 6.5 ఎకరాల భూమిని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ పేరిట ఈనెల 22న జీవో నంబర్ 206 జారీ అయింది. ఈ జీవో ప్రకారం ముషీరాబాద్ వన్ డిపోకు చెందిన అత్యంత విలువైన భూమిని హౌసింగ్ బోర్డుకు కేటాయిస్తూ జారీ చేశారు.
ఈ జీవోని తాము వ్యతిరేకిస్తున్నామని BMS రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి మరియు ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి కుమార్ తెలియజేశారు. కార్మికులు దశాబ్దాలుగా రక్తం ధారపోసి కష్టనష్టాలకు ఎదురొడ్డి కాపాడుకుంటూ వస్తున్న విలువైన భూములను ప్రభుత్వం లాక్కుంటూ పోతే సంస్థ మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న BMS రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మరియు BMS బాన్సువాడ అధ్యక్ష, కార్యదర్శులు M. ధర్మపాల్, T. మారుతి లు కూడా ఈ అక్రమ జీవోను తొలగించి ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.

إرسال تعليق